RadarURL

Mar 6, 2013

'బలుపు' ఆడియో హైదరాబాద్ లో కాదు

                                                                              

హైదరాబాద్: రవితేజ.... త్వరలో ‘బలుపు' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్‌ మలినేని ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ తుది దశకు చేరుకొంది. వచ్చే నెలలో పాటల విడుదల కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహిస్తారు. సినీ ప్రముఖుల సమక్షంలో భారీ హంగామాతో చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు 

ఇక ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కార్యక్రమాలు వికారాబాద్‌ పరిసరాల్లో సాగుతున్నాయి. హీరో, విలన్ బృందం మధ్య పోరాట సన్నివేశాల్ని చిత్రిస్తున్నారు. నలుగురిలో నెగ్గుకు రావాలంటే బలంతోపాటు బలుపు కూడా ఉండి తీరాల్సిందే అన్నది ఆ యువకుడి సిద్ధాంతం. అతగాడు ఎవరిపై గెలుపు పతాకం ఎగుర వేశాడో 'బలుపు' చిత్రంలో చూడాల్సిందే అంటున్నారు కథ గురించి దర్శకుడు. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్‌, అంజలి హీరోయిన్స్ . వీర సినిమా దగ్గర నుంచి రవితేజ సినిమాలన్నీప్లాపులే. దీంతో రవితేజ సినిమాలంటే ప్రేక్షకుల్లో క్రేజ్ కూడా తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో తన కెరీర్ ప్రమాదంలో పడిపోతుందనే విషయం గ్రహించిన రవితేజ ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ స్క్రిప్టు రచయితగా పని చేస్తున్నారు. ‘దూకుడు' సినిమాతో పాటు పలు చిత్రాలకు అదిరిపోయే స్క్రిప్టు అందించిన కోన వెంకట్ ఈ చిత్రానికి ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్ తో కూడిన స్క్రిప్టు అందించబోతున్నాడు.
 ఈ సారి రవితేజకు హిట్టు ఖాయమనే ధీమా ఆ చిత్ర వర్గాల్లో వ్యక్తం అవుతోంది. పరమ్‌ వి.పొట్లూరి నిర్మాత. కథ: కోన వెంకట్‌, బాబి, సంగీతం: తమన్‌, సమర్పణ: ప్రసాద్‌ వి.పొట్లూరి.

tags :Raviteja balupu audio, raviteja balupu mp3 songs, raviteja balupu trailor, raviteja balupu audio release

0 comments:

Post a Comment

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Lady Gaga, Salman Khan