
చెన్నై : వైవిధ్య కథానాయకుడు విక్రమ్ కి కమల్ తో నటించాలనేది తన
చిరకాల కోరిక అంటున్నారు.. ఆయన
దక్షిణాదినే కాక తాజాగా హిందీలోనూ పేరు
సంపాదించుకున్నాడు. ప్రస్తుతం 'కరిగాలన్', శంకర్ దర్శకత్వంలో 'ఐ'లో
నటిస్తున్నాడు. విక్రమ్‌కు ఓ ఆశ ఉందట. అదేమిటని అడిగితే.. కమల్‌హాసన్
నటనంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలన్నీ తప్పకుండా చూస్తా. ప్రతి చిత్రంలోనూ
ఆయన అభినయంలో కొత్తదనం కనిపిస్తుంది. ఇతర నటులు నేర్చుకునే కొన్ని విషయాలు
కూడా ఉంటాయి అందులో. చాలా మంది హీరోలతో కలసి తెరపై కనిపించాను. ఒక్కసారైనా
కమల్‌తో నటించాలనుంది. అలాంటి అవకాశం లభిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ
వదులుకోనని చెప్పాడు.
ఇక ట్యాలెంట్ కు కొదువ లేకపోయినా విజయాల వేటలో వెనక్కి తగ్గిన విక్రమ్
'ఐ'పై భారీ ఆశలే పెట్టుకున్నారు. 'సేతు'తో తనలోని నటుడ్ని పూర్తిస్థాయిలో
బయటికితెచ్చిన విక్రమ్ ఆపై దిల్, ధూల్, జెమినీ, సామి అంటూ వరుస విజయాలు
అందుకున్నాడు. శంకర్ దర్శకత్వంలో నటించిన 'అపరిచితుడు' ఆయన కెరీర్‌లో
ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఆ తర్వాత ఒక్క భారీ హిట్‌ను అందుకోలేకపోయిన
'చియాన్'కు విజయ్ దర్శకత్వంలో వచ్చిన 'నాన్న' కొంత వూరటనిచ్చింది.
కమర్షియల్ హిట్ కోసం పరితపిస్తూ వచ్చిన విక్రమ్ 'శివ తాండవం'పై భారీ
అంచనాలతో ఉన్నాడు. అయితే ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద పెయిల్యూర్ అవటం ఊహించని
దెబ్బ.
ఈ నేపథ్యంలో 'చియాన్' ప్రస్తుతం దృష్టంతా శంకర్ దర్శకత్వంలోని 'ఐ'పైనే
కేంద్రీకరించాడు. భారీ విజయం కావాల్సిన తరుణంలో శంకర్ ఆ కొరత
తీరుస్తాడనిఎదురు చూస్తున్నాడట విక్రమ్. ఆయన అభిమానులు కూడా 'మెగామేకర్'
మ్యాజిక్ చేస్తాడని భావిస్తున్నారట. ఈ అంచనాలను 'ఐ' ఎంతమేర అందుకుంటుందో
వేచి చూడాల్సిందే అంటున్నారు. ఎమీ జాక్సన్ 'చియాన్' సరసన ఆడిపాడుతోంది.
మలయాళ అగ్రనటుడు సురేష్‌గోపి, హాస్యనటుడు సంతానం కీలకపాత్రలు
పోషిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు తొలుత వార్తలు
వినిపించినా, ఇది రొమాంటిక్ ప్రేమకథ అని,ఒలింపిక్స్ నేఫధ్యంలో కథ
జరుగుతుందని విశ్వసనీయవర్గాలు వెల్లడిస్తున్నాయి. శరవేగంగా చిత్రీకరణ
జరుగుతోంది.
విక్రమ్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అపరిచితుడు' విడుదలై ఇప్పటికి దాదాపు
ఏడేళ్లు అవుతోంది. చాలా విరామం తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా
కాబట్టి ‘ఐ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే
ఏడాది విడుదల చేస్తారు. త్రీ ఇడియట్స్ రీమేక్ చేసిన శంకర్ ఆ చిత్రం
వర్కవుట్ కాకపోవటంతో ఈ సారి మళ్లీ తన రూట్ లోకే వెళ్లి ఈ చిత్రాన్ని
నిర్మిస్తున్నారు. భారీగా రూపొందే ఈ చిత్రం ఇప్పటివరకూ ఇండియన్ తెరపై ఎవరూ
టచ్ చేయని సబ్జెక్టుతో నిండి ఉంటుందని చెప్తున్నారు. యాక్షన్,ఎంటర్టైనర్ తో
మాస్ మసాలాగా ఉంటూనే సామాజిక సందేశంతో తయారు చేసిన ఈ స్క్రిప్టు దక్షిణాది
భాషలకే కాక హిందీ వారిని సైతం అలరించేలా ప్లాన్ చేస్తున్నారు. సంగీతం:
ఏఆర్ రెహమాన్. ఛాయాగ్రహణం: పి.సి.శ్రీరాం.
Source : http://telugu.oneindia.in/movies/tamil/2013/02/want-be-cast-with-kamal-vikram-112410.html
Source : http://telugu.oneindia.in/movies/tamil/2013/02/want-be-cast-with-kamal-vikram-112410.html
0 comments:
Post a Comment